గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: శు.అష్టమి రా.9.50 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ ఉ.11.02 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.3.25 నుండి 5.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.48 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.49 వరకు,అమృత ఘడియలు: రా.1.54 నుండి 3.40 వరకు.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.. కొత్తగా చేపట్టిన పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయులతో చర్చలు. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా కొనసాగుతాయి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.
కర్కాటకం... మిత్రులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం....... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థులకు నిరాశ. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కన్య.... అనుకోని పరిచయాలు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
తుల.... రుణభారాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం.... పలుకుబడి పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.
ధనుస్సు... లేనిపోని వివాదాలు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం..... పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధన, ఆస్తి లాభాలు. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
కుంభం... కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తుల కొనుగోలు యత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మీనం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.


