ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 19-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు

Aug 19 2026 3:04 AM | Updated on Aug 19 2026 3:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.సప్తమి రా.8.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి ఉ.9.10 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం: ప.3.12 నుండి 4.55 వరకు, దుర్ముహూర్తం: ప.11.38 నుండి 12.28 వరకు, అమృత ఘడియలు: రా.1.31 నుండి 3.15 వరకు.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం.. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం.... ముఖ్యమైన పనుల్లో పురోగతి. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. డబ్బుకు లోటు రాదు. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు తుదిక్షణంలో వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం.... సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కన్య... కొన్ని పనులను అనూహ్యంగా వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

తుల... శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు  సజావుగా సాగుతాయి.

వృశ్చికం.... వివాదాలతో సతమతమవుతారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం.... బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. కొన్ని వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

కుంభం.. ఆర్థికంగా ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆస్తుల కొనుగోలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం... వ్యయప్రయాసలతో పనులు పూర్తి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement