గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం; తిథి: బ.చతుర్దశి ఉ.7.50 వరకు, తదుపరి అమావాస్య; నక్షత్రం: పూర్వాభాద్ర తె.5.48 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఉత్తరాభాద్ర; వర్జ్యం: ప.12.13 నుండి 1.49 వరకు; దుర్ముహూర్తం: çప.11.44 నుండి 12.32 వరకు; అమృత ఘడియలు: రా.9.37 నుండి 11.11 వరకు.
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.. ప్రముఖులు పరిచయం. సంఘంలో ప్రత్యేక గుర్తింపు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
వృషభం..... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం.... సన్నిహితులతో వివాదాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార లావాదేవీలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కర్కాటకం... వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సింహం..... పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కన్య...... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటాలు. విచిత్ర సంఘటనలు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల... ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం..... ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
ధనుస్సు..... ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగుపడతాయి.
మకరం... కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత సామాన్యంగా ఉంటాయి. దైవచింతన.
కుంభం... శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మీనం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.


