ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, వస్తులాభం | Horoscope Today 12 11 2023 Rasiphalalu Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, వస్తులాభం

Published Sun, Nov 12 2023 7:06 AM | Last Updated on Sun, Nov 12 2023 9:13 AM

Horoscope Today 12 11 2023 Rasiphalalu Telugu - Sakshi

మేషం: కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తులాభాలు. కొత్త పరిచయాలు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.

మిథునం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు.  ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: కొన్ని పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.  శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తుల: ప్రముఖులతో పరిచయాలు. ధనలాభాలు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

మకరం: ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మిత్రులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement