నేటి రాశుల ఫలితాలు: ఈ రాశివారికి ఉద్యోగాల్లో ఊరట, ఇంకా ఏ రాశులవారికి ఎలాగ ఉందంటే..

horoscope today 01 04 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం: 5.59, సూర్యాస్తమయం: 6.08.

తిథి: శు.ఏకాదశి తె.4.02 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ద్వాదశి,
నక్షత్రం: ఆశ్లేష తె.4.42 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి మఖ,

వర్జ్యం: సా.4.15 నుండి 6.02 వరకు,
దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.34 వరకు,
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,  

అమృతఘడియలు: రా.2.54 నుండి 4.41 వరకు;

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు,  ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

వృషభం: నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా. 

కర్కాటకం: ఇంటాబయటా ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. క్రీడాకారులకు మంచి గుర్తింపు.

సింహం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. క్రీడాకారులకు పురస్కారాలు.

తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి  చిక్కులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: యత్నకార్యసిద్ధి.  మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. అవార్డులు దక్కుతాయి.

కుంభం: బంధువుల నుంచి  శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పనులు చకచకా సాగుతాయి. 

మీనం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. కళాకారులకు ఒత్తిడులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top