ఈ రాశివారికి ఇంటాబయటా ఒత్తిడులు

Daily Horoscope In Telugu 2 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.షష్ఠి రా.8.26 వరకుతదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాషాఢ ప.2.21 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.10.04 నుంచి 11.37 వరకు దుర్ముహూర్తం సా.4.35 నుంచి 5.23 వరకు, అమృతఘడియలు... ఉ.9.46 నుంచి 10.43 వరకు.

సూర్యోదయం        :  5.38
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు: 
మేషం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. 

మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. 

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

సింహం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దైవచింతన. 

కన్య: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: పనులలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. 

ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top