గ్రహం అనుగ్రహం (25-08-2020)

Daily Horoscope On (25-08-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.సప్తమి సా.4.47 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం విశాఖ రా.7.04 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.10.50 నుంచి 12.20 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.54 నుంచి 11.38 వరకు అమృతఘడియలు... ఉ.10.49 నుంచి 11.46 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశిఫలం
మేషం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం. 

వృషభం: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి. 

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

సింహం: పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు శుభవార్తలు. దైవదర్శనాలు. 

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు. 

మీనం: పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. .
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top