పిల్లలు ఫెయిలైతే తల్లిదండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమి కాదు. మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. పెద్దగా చదువుకోలేనివారు పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది. తల్లిదండ్రులు దానిని గుర్తించి పిల్లలను దిశగా ప్రోత్సహించాలి. –డాక్టర్ సుబ్రమణ్యం,
డీఈఓ,అన్నమయ్య జిల్లా


