జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ
కురబలకోట: జిల్లాలో ప్రతి బుధవారం స్వచ్చ పథం కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ సూచించారు. కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లి సచివాలయ పరిధిలో విశ్వం కళాశాల మార్గంలో స్వచ్చ పథం కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. రోడ్లు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామంలోని అన్ని రోడ్లను విధిగా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రోడ్లు పక్కన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని, వ్యర్థాలను తొలగించాలన్నారు. దీనిని యాప్‌లో నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓ గంగయ్య, డిప్యూటి ఎంపీడీఓ బాలమూర్తి, పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి రఘునాథ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


