ఉద్యోగి.. నిద్రమత్తులో జోగి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగి.. నిద్రమత్తులో జోగి

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

రొంపిచెర్ల: రొంపిచెర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ జయరాం నిద్రపోతూ కనిపించారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయానికి పనుల కోసం వచ్చిన రైతులు తమ కెమెరాల్లో బంధించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఆఫీస్‌లో నిద్ర పోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పులిచెర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌కు సరెండర్‌ చేశారు. దీంతో కలెక్టర్‌ రొంపిచెర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి మూడు నెలల క్రితం డిప్యూటేషన్‌ వేశారు. అయితే ఇక్కడ కూడా అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌ వివరణ కోరడానికి ప్రయత్నించగా.. ఆయన రెండు రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement