మదనపల్లె టౌన్: పశువులు పంట నష్టం చేశాయని నిలదీసిన పాపానికి భార్య భర్తలపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. ఈ సంఘటన గురువారం రామసముద్రం మంలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నారిగానిపల్లె పంచాయతీ, దిగవలంబంవారిపల్లెకు చెందిన దంపతులు రమణ, గాయత్రి లు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ వ్యవసాయ భూమిలో పలు రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన మంజుల తన పాడి పశువులను మేతకు తోలుకెళ్లి పంటలు నష్టపరిచాయని నిలదీశారు. దీంతో ఆమె వెళ్లి జరిగిన గొడవ విషయం ఇంట్లో చెప్పడంతో మంజుల కుటుంబీకులు మూకుమ్మడిగా వచ్చి దంపతులపై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. బాధితులను వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకురావడంతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


