బాధితుడి పరిస్థితి విషమం
మదనపల్లె టౌన్: మదనపల్లె చిత్తూరు బస్టాండులో ఆర్టీసీ బస్సు వృద్ధుడిపైకి దూసు కెళ్లింది. గురువారం జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ, రాంగారెడ్డి కాలనీకి చెందిన వెంకటరెడ్డి(63) సొంత పని మీద స్థానిక చిత్తూరు బస్టాండు వద్దకు వచ్చాడు. అక్కడపని ముగించుకుని తిరిగి ఇంటికి నడిచి వెళుతుండగా, చిత్తూరు బస్టాండుకు వస్తున్న మదనపల్లె – కందూరు మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సు పాదచారునిపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని స్థానికుల సాయంతో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సుబ్రమణ్యం ఓ ఆటోలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతికి తరలించాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


