మదనప్లె టౌన్: కారు ఢీకొని మేసీ్త్ర తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ప్రమదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకు చెందిన వై. రామాంజులు(48) మేసీ్త్ర పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే బుధవారం మదనపల్లెకు భవన నిర్మాణం పనులు సిబ్బందితో చేయించడానికి వచ్చాడు. రాత్రి పొద్దుపోయే వరకు మదనపల్లె లోనే ఉండిపోయాడు. పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంలో అర్థ రాత్రిలో తంబళ్లపల్లెకు బయలుదేరాడు. బైక్ కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించి, బాధితుడి చెవి నుంచి రక్తం ఆగకుండా వస్తోదని తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదపుతప్పి ఇద్దరికి..
గాలివీడు: మండల పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సూర్యప్రతాప్ రెడ్డి (పందికుంట), ఖాజావలి కుమారుడు అమీనుల్లా (గాలివీడు) పరీక్ష ముగిసిన సందర్భంగా వెలిగల్లు ప్రాజెక్టును సందర్శించేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అమీనుల్లా కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. సూర్యప్రతాప్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు., మెరుగైన వైద్యం కోసం అమీనుల్లాను తిరుపతికి, సూర్యప్రతాప్ రెడ్డిని రాయచోటికి తరలించినట్లు తెలిసింది.


