మదనపల్లె టౌన్: ప్రభుత్వ నిషేధిత నాటు సారాను నిరంతరంగా అమ్ముతున్న నిందితుడిపై ఎకై ్సజ్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించి గురువారం స్థానిక ఎకై ్సజ్ సీఐ భీమలింగ మీడియాకు తెలిపిన వివరాలు.. పట్టణంలోని బుగ్గ కాలువకు చెందిన మూడే బాలాజి నాయక్ (32) గత కొంత కాలంగా ప్రభుత్వ నిషేధిత నాటు సారాను ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణలతో చెలగాటం ఆడుతున్నాడు. పలు మార్లు పట్టుకుని కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినా తీరు మార్చుకోలేదన్నారు. ఇప్పటికే బాలాజి నాయక్ పై మొత్తం ఆరు సారా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ నాటు సారా అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతుండంతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి కలెక్టర్ ఆదేశాలతో బాలాజి నాయక్ పై పీడీ యాక్టు ప్రయోగించినట్లు సీఐ తెలిపారు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపించామని చెప్పారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా సారా తయారీకి బెల్లం విక్రయించినా, నాటు సారా తయారుచేసి విక్రయాలకు పాల్పడినా వారిపై పీడీ యాక్టు ప్రయోగించడం జరుగుతుందని హెచ్చరించారు.


