ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. బుధవారం మదనపల్లె జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శ్రీనెలవారీ నేర సమీక్షలో ఆయన పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు యంత్రాంగం అనుసరించాల్సిన కీలక వ్యూహాలను వివరించారు. నిషేధిత ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలని సూచించారు. పేకాట, కోడి పందేలు, బహిరంగ మద్యపానం వంటి చట్టవ్యతిరేక పనులను అరికట్టడానికి సాంకేతికతను ముమ్మరంగా వాడాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, గంజాయి మూలాలను వెలికితీసి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినుల భద్రతపై రాజీ పడకూడదన్నారు. శక్తి బందాలు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటించాలన్నారు. శక్తి యాప్, 112 అత్యవసర నంబర్ల నుండి వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసు కోవాలన్నారు. పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలీసుల పర్యవేక్షణ లోపం వల్ల కోర్టులో కేసులు వీగిపోతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కష్ణమోహన్, జిల్లాలోని సీఐలు ఎస్‌ఐ లు పాల్గొన్నారు.


