మదనపల్లె టౌన్: చౌడేపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరి వేసకుని ఆత్మహత్యకు యత్నించాడు.బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎల్లకుంట్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (46) కూలి పనులు చేస్తూ భార్య పిల్లలను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం నిద్దురలేచి ముందే తెచ్చుకున్న మద్యం మళ్లీ తాగి, ఆ మత్తులో తాను ఉంటున్న బెడ్ రూంలో తాడుతో ఉరి వేసుకోబోయాడు. పిల్లలు గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సుబ్రమణ్యంను ఉరి నుంచి తప్పించి వెంటనే అక్కడి పిహెచ్‌సీకి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. చౌడేపల్లె పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కుటుంబ సమస్యలతో రైతు..
గన్నేరు పప్పు తిని రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాచవీటి వారిపల్లె పంచాయతి, బురుజు మదిగపల్లెకు చెందిన రైతు రమణ(55), వ్యవసాయ పనులతో పాటు అడపా దడపా కూలిపనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపం చెందాడు. ఊరికి సమీపంలో ఉన్న గన్నేరు చెట్టుకు బెరడు తొలగించి, ఆ పప్పును తిన్నాడు. వాంతులు చేసుకుని తీవ్ర ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు గమనించి బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు.
ఆత్మహత్యకు యత్నించిన సుబ్రమణ్యం
చికిత్స పొందుతున్న రమణ


