మదనపల్లె టౌన్: అమ్మవారి విగ్రహం ఊరేగింపు సమయంలో గ్రామస్తులు టపాసులు పేల్చారు. నిప్పులు పొర పాటున పక్కనే ఉన్న ఓ పూరింటి మీద పడడంతో ఆ ఇళ్లు కాలిపోయి రూ. రెండు లక్షల ఆస్తి నష్టం వాటిళ్లింది. మదనపల్లె మండలంలో బుధవారం వెలుగుచూసిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బొగ్గిటివారిపల్లెలో గంగమ్మ విగ్రహ ప్రతిష్ట బుధవారం నిర్వహించాలని మంగళవారం రాత్రి గ్రాముస్తులు మొదట అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చారు. నిప్పులువెళ్లి పొరపాటున గంగులప్పభార్య లక్షుమమ్మ పూరింటి మీద పడడంతో మంటలు చెలరేగి నిమిషాల్లోనే కాలిపోయింది. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా, ఇట్లో ఉన్న లక్షుమమ్మను రక్షించారు. అయితే ఇంట్లో ఉన్న ఫర్నిచర్, దుస్తులు, ఆహారధాన్యం కాలిపోయాయి. సుమారు రెండు లక్షల వరకు ఆస్థి నష్టం వాటిల్లింది. తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గ్రామంలో రెండు వర్గాల మద్య గొడవలు ఉన్నాయి. ఇళ్లు కాలడానికి వేరే ఇతర కారణలు ఏవైనా ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


