కుటుంబ సమస్యలతో.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సమస్యలతో..

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పుంగనూరు నక్కబండకు చెందిన ఎరగడ్డల వ్యాపారి క్రిష్ణమూర్తి(48) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపం చెందాడు. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిండంతో వైద్యం అందించారు. అనంతరం డాక్టర్ల సలహాపై అక్కడి నుంచి వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు రావడంతో వారు మెరుగైన వైద్యం అందించారు. దీంతో క్రిష్ణమూర్తికి ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement