పుంగనూరు : మండలంలోని చిన్నతాండలో నివాసం ఉన్న దేవిప్రసాద్‌నాయక్ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళాలు పగులగొట్టి బీరువాలోని 56 గ్రాముల బంగారునగలు, రూ.10 వేలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
పీలేరురూరల్ : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీఎస్‌ఆర్ కల్యాణమండపంలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు టెట్ నిబంధన విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంటే, పరిష్కార చర్యలు చేపట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ఉండడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ, ఐఆర్‌పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్. సాయిశ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎ. శివారెడ్డి, ఎస్టీయూ నాయకులు కె.వి. శేఖర్, గాజుల నాగేశ్వరరావు, పి. రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, పోకల మధుసూదన, జగన్‌మోహన్‌రెడ్డి, కడియాల మురళి, మోహన్, వేణుగోపాల్‌రెడ్డి, గంటా మోహన్ పాల్గొన్నారు.
2029లో వైఎస్సార్‌సీపీ గెలుపొందాలని ప్రార్థనలు
పుంగనూరు : రాష్ట్రంలో 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందాలని అజ్మీర్ దర్గాలో ఆదివారం స్థానిక ముస్లింలు ప్రార్థనలు చేశారు. మైనార్టీ నాయకులు రజీఅహమ్మద్, మస్తాన్, ఫకృద్ధీన్, ఖాదర్‌బాషాలు అజ్మీర్‌కు వెళ్లారు. అజ్మీర్‌దర్గాలో చాదర్ అందజేసి దువ్వా చేశారు. పుంగనూరులో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కుటుంబం బాగుండాలని, వైఎస్సార్‌సీపీ రాష్ట్రమంతా గెలుపొంది, వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


