మదనపల్లె : గృహనిర్మాణశాఖ జిల్లా మేనేజర్‌గా దుర్గాప్రసాద్ సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. చిత్తూరులో పనిచేస్తున్న ఆయనకు ఉద్యోగోన్నతి లభించడంతో ఇక్కడికి బదిలీ చేశారు. ఇన్‌చార్జ్ మేనేజర్ వెంకటరెడ్డి ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
పేకాడుతూ పట్టుబడ్డ జనసేనాని!
సాక్షి టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందటంతో నిమ్మనపల్లె ఎస్‌ఐ రామకష్ణ సిబ్బందితో ఆ పేకాట స్థావరంపై దాడిచేశారు. పేకాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో అదే గ్రామానికి చెందిన జనసేన మండల అధ్యక్షుడు ప్రదీప్‌సింగ్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కేసు నుంచి జనసేన మండల అధ్యక్షుడి పేరు తొలగించాలని ఎస్‌ఐ రామకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అతడిని తప్పించి 10 మందిపై కేసు నమోదుచేశారు. ప్రదీప్‌సింగ్ గురించి అడగగా, అతడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అని చెప్పారు. పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది అతడేనన్నారు.


