గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉదయ్‌కిరణ్‌కుమార్‌రెడ్డిని ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. రాయచోటి సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో ఆదివారం జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. వైస్ ప్రెసిడెంట్‌గా సుందరేషన్, సెక్రటరీగా గణేష్, జాయింట్ సెక్రటరీగా అబూబకర్ సాదిక్, ట్రెజరర్‌గా అల్తాఫ్, ఈసీ మెంబర్లుగా మేరీ ప్రసన్న, గురకుస్వామి, అబ్దుల్ సత్తార్, ప్రశాంతిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ నాయకులు మహమ్మద్ అజీజుల్లా, అబ్దుల్ సత్తార్,మహబూబ్‌బాషా, సర్వేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం జరిగే డయల్ యువర్ ిసీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చు.
● డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీ ర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా 9440817449 నంబర్‌కు కాల్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఒకప్రకటనలో తెలిపింది.


