కలికిరి సీఐ బదిలీ | - | Sakshi
Sakshi News home page

కలికిరి సీఐ బదిలీ

Jan 27 2026 8:02 AM | Updated on Jan 27 2026 8:02 AM

కలికి

కలికిరి సీఐ బదిలీ

కలికిరి సీఐ బదిలీ ఢిల్లీ వేదికపై మెరిసిన తెట్టు అంగన్‌వాడీ టీచర్‌ గణతంత్ర వేడుకల్లో ప్రొటోకాల్‌ ఎక్కడ?

కలికిరి: కలికిరి సీఐ కె.రామచంద్రను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 నెలల క్రితమే కలికిరి సీఐగా వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారమే విఽ దుల నుంచి రిలీవ్‌ అయ్యారు. కాగా కలికిరి అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు సీఐని నియమించలేదు.

కురబలకోట: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని తెట్టు గ్రామ అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ ఎం. గౌరీ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని అంగన్‌వా డీ కేంద్ర టీచర్లకు ఐదుగురికి అవకాశం లభించింది. తంబళ్లపల్లి ప్రాజెక్టు నుంచి ఈమెకు మా త్ర మే ఈ అవకాశం లభించడం విశేషం. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాధమిక విద్య, గర్భి ణులు, బాలింతలు, కిశోర్‌ బాలికలకు అందజేసిన సేవలు అధికారుల మన్ననలు చూరగొన్నాయి.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రొటోకాల్‌ కనిపించలేదు. కలెక్టర్‌, ఎస్పీలు ప్రధాన వేదిక నుంచి కార్యక్రమం నిర్వహించగా పక్కనే ప్రొటోకాల్‌ కలిగిన ప్రజాప్రతినిధులకు గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఇతర ప్రొటోకాల్‌ అమలయ్యే వారు ఆశీనులు కావాల్సి ఉంది. అయితే అధికారులు దీన్ని పాటించలేదు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మినహా మిగిలిన వాళ్లంతా సాధారణ టీడీపీ నాయకులే కావడం గమనార్హం. వీరు ప్రొటోకాల్‌ కలిగిన పదవులు, రాజ్యాంగబద్ధమైన పదవి లేనివాళ్లే. అయినప్పటికి గ్యాలరీలో వచ్చి ఎమ్మెల్యేతో పాటు వీరిని గ్యాలరీలో ముందు వరసలో కూర్చోబెట్టడం సబబేనా అంటూ విమర్శలు వస్తున్నాయి.

కలికిరి సీఐ బదిలీ 1
1/1

కలికిరి సీఐ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement