ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు | - | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు

Jan 26 2026 4:43 AM | Updated on Jan 26 2026 4:43 AM

ఏఆర్‌

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు ఏపీ బేస్‌బాల్‌ మేనేజరుగా ఎంపిక 29న అతిథి ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ రెడ్డెమ్మా..కరుణించమ్మా.. హల్‌చల్‌ చేస్తున్న ఒంటరి ఏనుగు

మదనపల్లె: జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీగా డి.ఏడుకొండలు ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బలగాల ప్రాధాన్యత, శాంతిభద్రల విషయంలో వీరికున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ నిత్య పర్యవేఽక్షణతో పోలీసు దళాలు సంసిద్ధత కలిగి ఉండాలని సూచనలు చేశారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 బాలుర విభాగంలో బేస్‌ బాల్‌ జట్టుకు జాతీయ జట్టు మేనేజరుగా రామనపల్లి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ పీఈటీ పోలంకి గణేష్‌ బాబు నియమితులయ్యారు. ఈ నెల 29 నుంచి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం కళాశాల ఇంగ్లీష్‌ విభాగంలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఆచార్య టి.శ్రీనివాస్‌ తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, నెట్‌/సెట్‌/పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్‌, జిరాక్స్‌ సర్టిఫికెట్లతో నేరుగా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని న్యూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ భవనం లోని ఆంగ్ల శాఖలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. వివరాల కోసం www.yvu.edu.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.

పులిచెర్ల(కల్లూరు): మండలంలోని కమ్మపల్లె పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లె పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో ఆదివారం తెల్లవారు జామున ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేస్తూ ఉండగా ఫారెస్టు అధికారులు గుర్తించారు.రాత్రి పూట ఏనుగు పంపొలాలపై పడి పంటను నాశనం చేసింది. మామిడి కొమ్మలను విరిచేసింది.అనంతరం సమీపంలోని సూరప్ప చెరువులోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఫారెస్టు అధికారులు ఉదయం ఆ ప్రాంతానికి వచ్చి డ్రోన్‌ సహాయంతో ఏనుగు తిరిగే ప్రదేశాన్ని గుర్తించి దానిని బయటకు తరిమి వేయడానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో రేంజ్‌ ఆఫీసర్‌ థామస్‌ సుకుమార్‌,ఎఫ్‌బిఓలు మధు,ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు 1
1/2

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు 2
2/2

ఏఆర్‌ డీఎస్పీగా ఏడుకొండలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement