పార్టీ పటిష్టతకు గ్రామ కమిటీలే కీలకం | - | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతకు గ్రామ కమిటీలే కీలకం

Jan 3 2026 7:04 AM | Updated on Jan 3 2026 7:04 AM

పార్టీ పటిష్టతకు  గ్రామ కమిటీలే కీలకం

పార్టీ పటిష్టతకు గ్రామ కమిటీలే కీలకం

పీలేరు రూరల్‌ : వైఎస్సార్‌ సీపీ మరింత పటిష్టతకు గ్రామ కమిటీలు కీలకమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, అందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్సార్‌సీపీకి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉందని అన్నారు. వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో వైఎస్‌ .జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, గ్రామ కమిటీలను రచ్చబండ ద్వా రా ఎలా ఎన్నుకోవాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, హరీష్‌రెడ్డి, సాయి క్రిష్టారెడ్డి, ఎంపీపీలు సతీష్‌రెడ్డి, అప్పళ్ల, జెడ్పీటీసీ ఎటి. రత్నశేఖర్‌రెడ్డి, ముక్తియార్‌, మండల కన్వీనర్లు దండు జగన్‌మోహన్‌రెడ్డి, శివారెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, కమలాకర్‌రెడ్డి, నాయకులు నీళ్ళ భాస్కర్‌, మహితానంద్‌, నరసింహారెడ్డి, లక్ష్మీ, స్టాంపుల మస్తాన్‌, చక్రధర్‌, ఉదయ్‌, షాకీర్‌, భాను ప్రకాష్‌రెడ్డి, చంద్రారెడ్డి, అమరనాథరెడ్డి, లోకనాథరెడ్డి, రాజేష్‌, మధుసూదన్‌రెడ్డి, మునీర్‌, దావూద్‌, హబీ బ్‌, రియాజ్‌, సబీర్‌, శ్రీనివాసులురెడ్డి, జయరామచంద్రయ్య, సీకే యర్రమరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement