ఉర్దూ సాహిత్యానికి మహమ్మద్‌ హాషిం సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ఉర్దూ సాహిత్యానికి మహమ్మద్‌ హాషిం సేవలు చిరస్మరణీయం

Dec 31 2025 7:16 AM | Updated on Dec 31 2025 7:16 AM

ఉర్దూ సాహిత్యానికి మహమ్మద్‌ హాషిం సేవలు చిరస్మరణీయం

ఉర్దూ సాహిత్యానికి మహమ్మద్‌ హాషిం సేవలు చిరస్మరణీయం

రాయచోటి జగదాంబసెంటర్‌ : ఉర్దూ సాహిత్యరంగానికి షేక్‌ మహమ్మద్‌ హాషిం అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం అన్నారు. మంగళవారం రాయచోటిలోని డైట్‌లో ఆధునిక ఉర్దూ సాహిత్యం అంశంపై నిర్వహించిన సమావేశానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహమ్మద్‌ హాషిం తన రచనల ద్వారా పాఠకులను ఆలోచింపజేసేలా, సమాజానికి స్పష్టమైన సందేశం అందించేలా సాహిత్యసేవలు అందించారని కొనియాడారు. ఉర్దూ భాషా వికాసానికి ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ ఎం.నర్సింహారెడ్డి, అసిస్టెంట్‌ ఏఎంఓ అసాదుల్లా బాషా, అన్నమయ్య జిల్లా రూట ప్రెసిడెంట్‌ సబాతుర్‌రెహమాన్‌, ప్రధాన కార్యదర్శి జాఫరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement