చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలి
సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో నిర్ణయం మార్చుకోవాలి. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా మా నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ఉపయోగంలోకి తీసుకు రాకపోగా, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గం. రానున్న కాలంలో పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు కూడా దక్కే పరిిస్థితి ఉండదు. అలాగే పేదల ఆరోగ్యానికి కూడా భరోసా లభించదు.
– కె.సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు


