ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అన్ని వర్గాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభించింది. బినామీలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టబెట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. – ఆకేపాటి అమర్నాథ్‌రెడి,
పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం చంద్రబాబు పాలన అసమర్థతకు నిదర్శనం. సామాన్యునికి సైతం మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో జగనన్న 17 మెడికల్ కళాశాలలను నిర్మించ తలపెడితే కూటమి ప్రభుత్వం రాగానే వాటిని వారికి అనుకూలమైన వ్యక్తులకు పంచిపెట్టి దోచుకునే చర్యలకు కూటమి ప్రభుత్వం దిగజారడం దారుణం. – కొరముట్ల శ్రీనివాసులు,
మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తూ తీసుకొన్న నిర్ణయం పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన మెడికల్ విద్యార్థుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. ప్రభుత్వం ఈ నిర్ణయా న్ని వెనక్కి తీసుకునే వరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తాం. – చింతల రామచంద్రారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, పీలేరు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూ డా తీసుకురాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది.వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే వీటిని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. – గడికోట శ్రీకాంత్ రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది


