‘సంతకమే’ సమరశంఖం
తంబళ్లపల్లె/ములకలచెరువు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను జిల్లా ప్రజలు వ్యతిరేరకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సంతకంతో చెక్ పెట్టేందుకు ముందుకొస్తున్నారు. భవిష్యత్తు తరాల బాగు కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి ఆదివారం తంబళ్లపల్లె మండలం బాలిరెడ్డిగారిపల్లె పంచాయతీ, ములకలచెరువులో సంతకంతో మద్దతు తెలిపారు. తంబళ్లపల్లె మండలంలోని బాలిరెడ్డిగారిపల్లె పంచాయతీలో ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అప్పిరెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి, నరేంద్రరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యానికి పెద్ద పీట వేసి ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోగా, కొత్తగా పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్, నాయకులు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ములకలచెరువులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించారు. మెడికల్ కాలేజీలే ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్ధులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ నెల 17న రాష్ట్ర గవర్నర్‌ను వైఎస్సార్‌సీపీ అఽధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి పీపీపీ విధానంపై వివరిస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వనితులు సిద్దారెడ్డి, మాజీ సింగల్‌విండో చైర్మన్ సదాశివప్ప, వైఎస్ ఎంపీపీ మల్లికార్జున, ములకలచెరువు బూత్ కమీటీ అధ్యక్షుడు చాంద్‌బాషా, సర్పంచి రామనాథం, ఎంపీటీసీ రఫి, నాయకులు అన్సర్‌బాషా, బావయ్య, సయ్యద్‌బాషా, మౌలాలి, నాగేంద్ర, విష్ణువర్ధన్, బాబాజి, ఇంతియాజ్ ఉన్నారు.
మదనపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టయిన తర్వాత రెండు మద్యం షాపులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ షాపులకు మళ్లీ టెండర్లు నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రం ములకలచెరువులోని టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ పేరిట ఉన్న మద్యం దుకాణం, పెద్దతిప్పసముద్రం మండలం చెన్నరాయుని పల్లె వద్ద ఉన్న టిడిపి నేత కట్టా సురేంద్రనాయుడు మద్యం దుకాణాలను సీజ్ చేశారు. నకిలీ మద్యం విక్రయాల వ్యవహారంలో వీరి ప్రమేయం ఉందని ఎకై ్సజ్ అధికారులు గుర్తించి వీరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సీజ్ లో ఉన్న ఈ షాపులకు తిరిగి టెండర్లు నిర్వహించి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ మధుసూదన్ రావు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కోటి సంతకాలకు విశేష స్పందన


