జాతీయ జెంబోరీలో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో గల నెల 22 నుంచి 29వ తేదీల వరకు నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జెంబోరీలో అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్లు, విద్యార్థులు ప్రతిభ చాటారు. వీరిని గురువారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జెంబోరీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులను అభినందించడం సంతోషకరమన్నారు. జిల్లా సెక్రటరీ ఎం.నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, స్కౌట్ మాస్టర్స్ నితిన్‌రెడ్డి, ప్రేమసాగర్, చినబాబు, ఖాదర్‌బాషా, గైడ్ కెప్టెన్లు నిర్మల, లక్ష్మి, తిరుమలదేవి, రేష్మ, వివిధ పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.


