కిడ్నీ రాకెట్ కేసులో పార్థసారఽథి లొంగుబాటు
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో కీలక నిందితుడు, ఏ–2 అయిన డాక్టర్ పార్థసారథిరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా అనూహ్యంగా గురువారం రాత్రి మదనపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆయన తరపున న్యాయవాది బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసు తీవ్రమైందని, బెయిల్ ఇవ్వరాదని వాదించారు. పోలీసులు అందించిన ఆధారాలతో కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం పార్థసారథిరెడ్డికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను స్థానిక సబ్ జైలుకు తరలించారు.
కిడ్నీ రాకెట్ కేసులో పార్థసారఽథి లొంగుబాటు


