జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఓబులవారిపల్లె : జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తమ కళాశాలకు చెందిన ఎస్.రామ్ శరణ్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మన్సూల్ అలీ తెలిపారు. ఆ విద్యార్థిని మంగళవారం ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అనకాపల్లిలో నిర్వహించిన ఖోఖో పోటీలకు సంజీవపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు వెళ్లి పాల్గొన్నారని పేర్కొన్నారు. అందులో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు రామ్‌శరణ్ అర్హత సాధించాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


