నవీన విద్యకు దారి ‘నవోదయ’
డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష
మదనపల్లె సిటీ : విలువలతో కూడిన విద్య, నైపుణ్యాల పెంపు, దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలకు పెట్టింది పేరు జవహర్ నవోదయ విద్యాలయం. ఇటీవల ఆరో తరగతి ప్రవేశాలకు మదనపల్లె సమీపంలోని వలసపల్లె జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయాలకు(జెఎన్‌వీ) నోటిఫికేషన్ విడుదలైంది. మదనపల్లెలోని నవోదయ విద్యాలయానికి 4,300 .మంది దరఖాస్తు చేసుకున్నారు. జెఎన్‌వీ ఆధ్వర్యంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి చిత్తూరుకు చెందిన 23 కేంద్రాల్లో డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో సీటు సాధించేందుకు కావాల్సిన మెలకువలను ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. https://cbseitms.rcil.gov.in/nvs ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రవేశాలు : జెన్‌వీలో ఆరో తరగతి
పరీక్ష తేదీ : 13.12.2025
పరీక్షా కేంద్రాలు : 23 (ఉమ్మడి చిత్తూరు జిల్లా)
రాసే విద్యార్థులు : 4,300 మంది
సీట్ల సంఖ్య : 80
నవీన విద్యకు దారి ‘నవోదయ’


