‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలి
కలకడ : దిత్వా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.అనంతరం మండలంలోని చెరువులు, కుంటల్లోకి నీరుచేరిన శాతం గురించి ఆరా తీశారు.
అర్హత కలిగిన లబ్ధిదారులకు పింఛన్ అందించే బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని అన్నారు. కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీలో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పింఛన్ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.వికలాంగులు, వృద్ధులకు నెలవారీ పింఛన్ ఇంటివద్ద అందజేస్తున్నారా.! లేదా అని అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓ లక్ష్మిపతి, ఎంపీడీఓ భానుప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నందిని పాల్గొన్నారు.
పరిశ్రమల అనుమతులను త్వరగా జారీ చేయాలి
రాయచోటి : సింగిల్ డెస్క్ విధానం కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమల, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధరాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. గడిచిన 45 రోజుల కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు, రెన్యూవల్‌ను కోరుతూ మొత్తం 987 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో వాటిలో 961 పరిశ్రమలకు అనుమతులు మంజూరు అయ్యాయన్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవగాహన వర్క్‌షాప్‌లను గుర్రంకొండ, వాయల్పాడు, మదనపల్లె ప్రాంతాలలో నిర్వహించినట్లు, మహిళలకు టైలరింగ్ తదితర విషయాల్లో అవగాహన కల్పించినట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె కృష్ణ కిశోర్, జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ కె కృష్ణ కిశోర్, డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రవి తదితరులు పాల్గొన్నారు. అభివృధ్ధి పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో జేసీ ఆదర్శ రాజేంద్రన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫనెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్


