హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వై.పవన్‌కుమార్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో తోటి సిబ్బంది ఒక రోజు డ్యూటీ అలవెన్స్ రూ.2.30 లక్షలు స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బాధిత కుటుంబీకులకు సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు పవన్‌కుమార్‌రెడ్డి మర ణం తమకు వ్యక్తిగత నష్టం అన్నారు. ఇలాంటి సందర్భాల్లో సహచరులు కుటుంబానికి అండగా నిలవడం ఒక గొప్ప సంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఆర్‌ఎస్‌ఐ బాలాజీ, మృతుడి కుటుంబ సభ్యులు, సహచర హోంగార్డులు పాల్గొన్నారు.


