బాలిక అదృశ్యం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మారయ్యగారిపల్లికి ఓ వివాహ వేడుకకు వచ్చిన బాలిక(16) గత నెల 28 నుంచి కనిపించడం లేదని సోమవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన బాలిక ఒంటిమిట్టలో జరిగే ఓ వివాహానికి మారయ్యగారిపల్లెకు చెందిన తన మేనత్త ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. గత నెల 28 వ తేది అర్థరాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో అన్నిచోట్ల గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేశారు.
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు
వెంకటప్ప విద్యార్థి
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుందనశ్రీ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. గతనెల 22, 25 తేదీలలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన జిల్లా స్థాయి హాకీపోటీలలో కుందనశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
వైర్ల చోరీపై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి వైర్లు చోరీ జరిగినట్లు గ్రామ రైతు మోపూరి పెద్దదస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ వైర్ల విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు.


