మిద్దె పైనుంచి పడి గర్భిణి మృతి
వేంపల్లె : వేంపల్లెలోని పుల్లయ్యతోటకు చెందిన వల్లెపు దేవి(22)అనే గర్భిణి మిద్దైపె నుంచి కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు భర్త పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక పుల్లయ్య తోటలోని రెండవ అంతస్తులో గర్భణి వల్లెపు దేవి, పవన్ కళ్యాణ్ నివాసముంటున్నారు.
ఆదివారం దేవి కుమార్తె హేమదర్శిని మూడేళ్ల చిన్నారి మిద్దైపె నుంచి కిందికి దిగుతుండగా పైకి పాపను రావాలని పిలిచే సమయంలో దేవికి కళ్లు తిరిగి పైఅంతస్తు నుంచి కింద పడింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గర్భణి అయిన దేవి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి దేవికి 10 రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా.. ఈ ప్రమాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


