● చెట్లపైనే మాగుతున్న కాయలు..
వైఎస్ జగనన్న పాలనలో..
రాజంపేట: ఈ ఏడాది అరటికి గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. మూడేళ్ల క్రితం ఒక టన్ను అరటి రూ.25వేల వరఽకు ధర పలికితే, ఈ సారి అదే పరిణామం రూ1,000 కూడా ఉండటం లేదు.. పంట పడినా ఖర్చులు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నదాతలకు భరోసా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు ఆ ఆలోచనే చేయడంలేదు.కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నాలు జిల్లాలో మచ్చుకై నా కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. ఒక్క రాజంపేటలోనే పదివేల ఎకరాల్లో అరటి తోటలను సాగుచేస్తున్నారు. వినాయకచవతి సమయంలో గెల రూ.300 పలికింది. దసరా నాటికి రూ.230నుంచి రూ.250 మధ్య ధరలు కొనసాగాయి. మొదటి, రెండో, మూడో క్రాప్‌కోతకు సిద్ధంగా ఉంది.
పడిపోయిన ఎగుమతులు
రాజంపేట, రైల్వేకోడూరు నుంచి నిత్యం నాంధేడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడ్లు వెళ్లేవి. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో లారీలు రైల్వేకోడూరులో పక్కనపెట్టేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.15 నుంచి 18 వేల వర కు ధరలు పలకగా ప్రస్తుతం టన్ను అరటి రూ.2 నుంచి 4వేలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కోనేవారు లేక చెట్లపైనే కాయలు మాగిపోతున్నాయి.
ఉత్తరాదిరాష్ట్రాలలో డిమాండ్ లేక..
విదేశాలకు ఎగుమతి నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో మామిడి రైతులు సీజన్‌లో ధరలు లేక అల్లాడిపోగా ప్రస్తుతం అరటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రైతులు అరటికాయలను ట్రాక్టర్, ఆటోల్లోనూ, బైకులో పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకుంటున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అరటి రైతుకు స్వర్ణయుగమనే చెప్పాలి. నాణ్యమైన దిగుబడులు ఏటా ఫ్రూట్‌కేర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించారు. సబ్సిడీపై కవర్లు ఇవ్వడమే కాదు...వసాయ క్షేత్రాల వద్దే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్‌పై రైతులకు శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించారు. ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా మార్కెట్‌కు పంట వచ్చే ముందు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటు ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించారు. విదేశాలకు ఎగుమతుల కోసం ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపారు.
ఇతని పేరు మహేష్‌నాయుడు. ఒంటిమిట్ట మండలం చింతరాజపల్లె. తనకున్న రెండు ఎకరాల్లో అరటిసాగు చేశారు.ధర బాగుంటుందని ఆశించాడు.అయితే ధరలు ఆశించన విధంగా లేదు. కొనేందుకు వ్యాపారులు కూడా ముందుకురాలేదు. చేసేదేమిలేక తానే బైకుమీద అరటి కాయలు (పచ్చఅరటి) పెట్టుకొని ఒంటిమిట్ట, నందలూరు సమీప ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాడు.
చెట్టుకే మాగుతున్న గెలలు
కొనేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు
గిట్టుబాటుధర కల్పించడంలోప్రభుత్వం విఫలం
ఆందోళనలో రైతులు
గిట్టుబాటు ధర లేదు
నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేశాను. రూ.3 నుంచి రూ.4 లక్షలు ఖర్చు వస్తోంది. రూ.25 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది రూ.2వేల కంటే ఎక్కువ రాలేదు. గిట్టుబాటు ధరలేదు. తోట ల్లోనే గెలలు మాగిపోతున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.
–కుమార్‌రాజు, హస్తవరం, రాజంపేట
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
ఈ ఏడాది అరటి రైతులకు ధర ల విషయంలో అన్యాయం జరిగింది. వేలాది మంది తో టల్లోనే కాయలను వదిలేశారు.ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదు. వైఎస్ జగన్ హయాంలో అరటిరైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. – భాస్కర్‌రాజు, వైఎస్సార్‌సీపీ రూరల్ కన్వీనరు, రాజంపేట
ఇప్పటి వరకు తక్కువమంది మాత్రమే పంట అమ్ముకున్నారు. డిసెంబరు వరకు దిగుబడులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చెట్లపైనే కాయలు మగ్గిపోతుండటంతో చేసేదిలేక వచ్చిన ధరకు అమ్ముకోవాల్సివస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎకరం అరటిసాగుకు రూ.80వేలకు పైగా ఖర్చయింది. పంట చేతికి వచ్చేసరికి ధరలు పడిపోవడంతో నష్టపోయామని రాజంపేట, రైల్వేకోడూరుకు చెందిన రైతులు వాపోతున్నారు.
● చెట్లపైనే మాగుతున్న కాయలు..
● చెట్లపైనే మాగుతున్న కాయలు..
● చెట్లపైనే మాగుతున్న కాయలు..
● చెట్లపైనే మాగుతున్న కాయలు..
● చెట్లపైనే మాగుతున్న కాయలు..


