వేమన సతీష్‌ మాటేమిటో? | - | Sakshi
Sakshi News home page

వేమన సతీష్‌ మాటేమిటో?

Nov 30 2025 7:42 AM | Updated on Nov 30 2025 7:42 AM

వేమన

వేమన సతీష్‌ మాటేమిటో?

వేమన సతీష్‌ మాటేమిటో? ● లాభ నష్టాలు బేరీజు వేసుకుని స్పందన...

సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమల్లో తన..మన అంటూ ‘పచ్చ’పాతం చూపించే బాబు సర్కారు.. పార్టీ నేతలపైనా అదే పంథాను అనుసరిస్తోంది. మంచీ.. చెడు..న్యాయం.. ధర్మం కాకుండా ‘లెక్క’ల బేరీజులు వేసుకుంటూ మరీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓ మహిళ ఆరోపణలపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌ వ్యవహారంలో సీఎంఓ ఆగమేఘాలపై స్పందించింది. కానీ, తమ పార్టీకే చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి చేసిన ఆరోపణలపై స్పందనే లేకుండా పోయింది.పైగా సదరు మహిళా నాయకురాలిపైనే పోలీసులు వే ధింపులు తీవ్రమయ్యాయి. లాభ నష్టాల బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం స్పందన ఉన్నట్లు ఈ ఘటన ఉదంతం స్పష్టం చేస్తోంది.

● తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ వేమన సతీష్‌ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామ ని నమ్మించి రూ.7కోట్లు తీసుకున్నారని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు సుధా మాధవి ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో హైకోర్టు న్యాయవాది జడ శ్రమణ్‌కుమార్‌ అండతో మీడియా ముందుకు వచ్చి ఆవేదన వెళ్లబోసుకున్నారు. సుధా మాధవి కన్నీళ్లు టీడీపీ పెద్దల్ని కరిగించలేకపోయాయి. పైగా ఆమైపెనే ఒత్తిళ్లు వచ్చాయి. ‘వేమన సతీష్‌పై ఆరోపణలు చేస్తావా...’ అంటూ పోలీసు అధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

పార్టీ అధినేత చంద్రబాబుతో వేమన సతీష్‌ (ఫైల్‌

కన్నీటి పర్యంతమైన సుధా మాధవి (ఫైల్‌)

మంత్రి సంధ్యారాణి పీఏపై ఆగమేఘాలపై స్పందించిన సీఎంఓ

టీడీపీ మహిళా నేత సుధా మాధవి ఆవేదనపై ఇంతవరకు స్పందన కరువు

అధిష్టానాన్ని కరిగించలేని దళిత మహిళా నాయకురాలి కన్నీళ్లు

గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ సతీష్‌ తనకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, వేధింపులకు గురి చేశారని తాజాగా ఓ మహిళ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సీఎంఓ మంత్రి పీఏపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. మరి.. అంతకు మించి ఆరోపణలు వచ్చిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నాయకుడు వేమన సతీష్‌పై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదే పార్టీకి చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి ఆరోపణలపై సీఎంఓ నుంచి కనీస స్పందన కరువైంది. పైగా సుధా మాధవి సాక్ష్యాధారాలుగా ఉన్న వీడియోలు కూడా విడుదల చేశారు. అయినా పార్టీ నుంచి.. సీఎంఓ నుంచి ఆమెకు కనీస మద్దతు లభించలేదు. పైగా పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాన్ని గమనిస్తే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం చర్యలున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘మనోడైతే ఓ న్యాయం, పేదోడైతే మరో న్యాయం’ అన్నట్లుగా చర్యలున్నాయని వారు వివరిస్తున్నారు. వేమన సతీష్‌కు టీడీపీ పెద్దల మద్దతు ఉండడంతోనే పోలీసు వ్యవస్థ సైతం అండగా నిలుస్తూ దళిత మహిళా నాయకురాలిపై నిరంకుశితంగా వ్యవహరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వేమన సతీష్‌ మాటేమిటో? 1
1/1

వేమన సతీష్‌ మాటేమిటో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement