జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గుర్రంకొండ : జాతీయ స్థాయి ఫెన్సింగ్(కత్తిసాము) పోటీలకు గుర్రంకొండ విద్యార్థులు ఎంపికై నట్లు హెడ్మాస్టర్ తఖీవుల్లా తెలిపారు. స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పి.హరినాథరెడ్డి, ప్రసన్నకుమార్ జిల్లా ఫెన్సింగ్ జట్టుకు ఎంపికై ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పి.హరినాథరెడ్డి రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ప్రసన్నకుమార్ జట్టు తరఫున బంగారు పతకం సాధించారు. ఈ ఇద్దరు విద్యార్థులు త్వరలో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు మన రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కాగా ఇదే హైస్కూల్‌కు చెందిన దిలీప్‌కుమార్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించారు. వీరికి శుక్రవారం ఆ పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ రవీంద్రనాథ్, పీడీలు శ్రావణీ, రమేష్, ఉపాధ్యాయులు విశ్వేశ్వరరెడ్డి, పద్మలత, లక్ష్మీలు పాల్గొన్నారు.


