ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు

Nov 29 2025 7:19 AM | Updated on Nov 29 2025 7:19 AM

ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు

ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు

కలికిరి : 11 కేవీ విద్యుత్‌ లైన్‌ ప్రమాదం ఘటనకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మండలంలోని మర్రికుంటపల్లి కేంద్రంలో ఈ నెల 27న ఉదయం సిద్దయ్య గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఎ.నాగార్జున, పి.ఉదయ్‌కుమార్‌, యజమాని సిద్దయ్య ముగ్గురూ కలిసి 26న ఉదయం ఇంటి ముందు పందిరి వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందున్న 11 కేవీ విద్యుత్‌ వైరు తగిలి షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో నాగార్జున తీవ్ర గాయాలపాలుకాగా, ఉదయ్‌కుమార్‌, సిద్దయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. నాగార్జునను స్థానికులు కలికిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలించారు. నాగార్జున తండ్రి వీరభద్రయ్య తన కుమారుడు ప్రమాదానికి గురి కావడానికి ట్రాన్స్‌కో ఏఈ ముజీబుర్‌ రెహ్మాన్‌, లైన్‌మ్యాన్‌ గోపి నిర్లక్ష్యమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏఎస్‌ఐ మాబు సాహెబ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement