ఒక్క ముహుర్తం కూడా లేదు
శుక్రమౌఢ్యమి ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. 28న ఉద యం వివాహాలకు ఒక ముహుర్తం మాత్రమే ఉంది. ఆ తరువాత నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక్క ముహుర్తం కూడా లేదు. ఈసారి మాఘ మాసం కూడా మూఢంలోనే కలిసిపోయింది. నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు,ఇతర శుభకార్యాలు జరుపుకునే వారు మూఢమి ముగిసే వరకు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ 80 రోజుల్లో మంచి ముహూర్తాలు లేవు. –ఆలూరి ఫణికుమార్‌శర్మ,
పురోహితులు, మదనపల్లె
సంపాదన తగ్గిపోతుంది
పెళ్లిళ్ల సీజన్ ఉంటే సంపాదన ఉంటుంది. ముహుర్తాలు ఉంటే పూలకు డిమాండ్ ఉంటుంది. ఈ సారి శుక్రమౌఢ్యమి 80 రోజులు రావడంతో చేతిలో పని తగ్గిపోతుంది. దీనిపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడకతప్పదు. –ఎంబీఎస్ బాషా,
పూలవ్యాపారి, మదనపల్లె
ఒక్క ముహుర్తం కూడా లేదు


