4న వాలీబాల్ ఎంపికల ట్రయల్స్
కడప కోటిరెడ్డిసర్కిల్: యోగి వేమన విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే విశ్వవిద్యాలయ వాలీబాల్ మహిళలు, పురుషుల జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్స్ ట్రయిల్స్ డిసెంబరు 4న ఉదయం 9.00 గంటలకు నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కొవ్వూరు రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


