దరఖాస్తుల ఆహ్వానం
పీలేరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ అతిథి అధ్యాపకుని పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో కశాశాలకు హాజరు కావాలని కోరారు.
రాయచోటి: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08561–293006 ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రాయచోటి: జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ నున్నె అనురాధ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, విద్యా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అన్నమయ్య ఏపీసీగా నియమితులయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రమణ్యం అనురాధకు ఏపీసీగా బాధ్యతలు అప్పగించారు.అనంతరం సమగ్ర శిక్షా చైర్మన్ జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాయచోటి: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌తో కలిసి డీఆర్‌డీఏ అధికారులు జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7901610271, 7901612076, 79016 10324 నెంబర్లల్లో సంప్రదించాలన్నారు. జాబ్ మేళా.మెప్మాపీ.కమ్ వెబ్‌సైట్, అలాగే సమీప మెప్మా కార్యాలయంలో, పురపాలక సంఘ కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి, రాయచోటి, మదనపల్లె, రాజంపేట మెప్మా సిబ్బంది, జిల్లా ఐబీ స్పెషలిస్టు నాగరాజులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం


