క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి: క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు మంచి ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం రాయచోటిలోని జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. డీఈఓ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభించారు. జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు దివ్యాంగ పిల్లలకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 30 మండలాల నుంచి 150 మంది దివ్యాంగ పిల్లలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరుగుపందెం, షాట్‌పుట్, జావలిన్ త్రో, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ స్థానిలకు మెడల్స్, సర్టిపికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులు, కడప చైర్మన్ దామోదర్ రెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ కె వీరాంజనేయులు, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోప్యాద్యాయులు చంద్రశేఖర్, త్రివేణి వ్యాయామ ఉపాధ్యాయులు నరసరాజు పాల్గొన్నారు.


