●సిద్దవటం, ఒంటిమిట్టలను అన్నమయ్యలో కలపొద్దు
సిద్దవటం: కడప జిల్లాతో అన్ని రకాల సామాజిక, రాజకీయ, వ్యాపార సంబంధాలు ఉన్న సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపొద్దని, కడపలోనే కొనసాగించాలని సిద్దవటం మండల వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం ఇక్కడ వారు మాట్లాడుతూ 10–15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపను కాదని 70 కిలోమీటర్ల దూరంలోని ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలపడం సరికాదన్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం సమర్పించామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వావిళ్ల శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కోటపాటి పెంచలయ్య, మండల యూత్ కన్వీనర్ ఆలం క్రిష్ణచైతన్య, సోషల్ మీడియా అధ్యక్షుడు కుప్పం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


