అండర్–14 హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
కలికిరి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) క్రీడల్లో భాగంగా కలికిరి ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం అండర్–14 హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మదనపల్లె డీవైఈఒ లోకేశ్వరరెడ్డి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. బాలుర విభాగంలో చిత్తూరు, కృష్ణా జిల్లా జట్లు పోటీ పడగా చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలోనూ అనంతపురం జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు గెలుపొందింది. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ పోటీల రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వరరావు, ఎంఈఒ–1 సురేష్, అన్నమయ్య జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఝాన్సి, పీడీలు శివరమేష్‌బాబు, ఉషారాణి, కరుణానిధి, చంద్రమౌళి, చిన్నప్ప, రెడ్డివరప్రసాద్, స్థానిక నాయకులు షాబుద్దీన్, గాయత్రిరెడ్డి, హెచ్‌ఎం నటరాజన్ పాల్గొన్నారు.


