రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలో ఎర్రబల్లి వద్ద నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలోని తోటపాళెంకు చెందిన పొమ్మల కనకయ్య (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు తెలిపారు. పల్స్‌ర్ వాహనంపై తన స్నేహితుడు తలారి జగదీశ్‌తో కలిసి బుధవారం అర్థరాత్రి సమయంలో రాజంపేట నుంచి నందలూరుకు వస్తున్న క్రమంలో అదుపుతప్పి సిగ్నల్ బోర్డును ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడన్నారు. తోటి స్నేహితునికి స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కనకయ్య మృతితో తోటపాళెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ఆటో నుంచి కింద పడి..
సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరిపురి రుషేంద్ర (17) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శెట్టిపల్లె గ్రామం తాటికుంట దళితవాడకు చెందిన ఆంజనేయులు, రాజేశ్వరి దంపతుల కుమారుడు రుషేంద్ర బంధువుల పెళ్లి పనుల నిమిత్తం గుట్టపల్లె సమీపంలోని ఓ కల్యాణ మండపం నుంచి సొంత గ్రామానికి నాలుగు చక్రాల ఆటోలో వెళుతుండగా గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కింద పడ్డాడు. తలకు గాయం కావడంతో స్థానికుల సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రవికుమార్ పరిశీలించి కేసు నమోదు చేశారు.
కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు
పుల్లంపేట : భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. యథేచ్ఛగా భూ కబ్జా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన గురువారం సంబంధిత భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. భూ ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సర్వేయర్ ఓబయ్య, వీఆర్‌ఓ సురేష్‌లతో కలిసి సంబంధిత స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా
కడప అర్బన్ : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


