కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
రాయచోటి అర్బన్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ కె.మహేంద్రన్ పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీసీపీ అబ్జర్వర్ అశోక్ రత్నం, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్‌లతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించామని తెలిపారు.
గ్రామీణ బ్యాంకులో
మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం
రాయచోటి జగదాంబసెంటర్ : కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగం సూచనల మేరకు మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాయచోటి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎల్డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ బ్యాంకులలో గత 10 సంవత్సరాల వరకు లావాదేవీలు జరపకుండా ఉన్న ఖాతాలు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం శాఖ నిర్వాహక అధికారి సదాశివరెడ్డి, వివిధ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి


