మైనారిటీల సామాజికాభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం
కలికిరి(వాల్మీకిపురం) : మైనారిటీల సామాజికాభివృద్ధి వైఎస్సార్‌సీపీతో సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్మీకిపురం మైనార్టీ నాయకులు వాల్మీకిపురానికి విచ్చేసిన మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు, దర్గాలు, ఈద్గాలు తదితర మైనార్టీల ధార్మిక సంస్థల అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తుచేశారు. ఉర్దూ భాషను ద్వితీయ అధికార భాషగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసిన ఘనత గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీం, ఖాదర్ బాషా, షమీ, అమీన్ పీర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


