పౌరులకు దిక్సూచి రాజ్యాంగం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న జేసీ ఆదర్శ రాజేంద్రన్
రాయచోటి : దేశ పౌరులకు మార్గం చూపే దిక్సూచి లాంటిదే రాజ్యాంగమని, అందులోని పీఠికను ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సూచించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్‌ఓ మధుసూదన్ రావులు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ యువత ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలని సూచించారు. రాజ్యాంగ విలువలు, ఆకాంక్షలకు రాజ్యాంగ పీఠిక నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్‌ల సూపరిటెండెంట్లు, సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం భారతీయుల ఆత్మ : అదనపు ఎస్పీ
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒకతాటిపై నడిపిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కుతుందని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది కార్యాలయ సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు వీజే రామకృష్ణ, ఎం. పెద్దయ్య, డీసీఆర్‌బీ సీఐ ఎం.తులసీరాం, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
పౌరులకు దిక్సూచి రాజ్యాంగం


